: పనబాక ఇంటిని ముట్టడించిన తెలుగు యువత
రాష్ట్ర విభజన బిల్లును సమర్ధిస్తూ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా తెలుగు యువత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ బాపట్లలోని ఆమె ఇంటిని ముట్టడించారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో భారీఎత్తున మోహరించిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.