: కూతుర్ని ఇంట్లో బంధించిన రాజస్థాన్ హైకోర్టు జడ్జి
హైకోర్టు న్యాయమూర్తి.. అంటే న్యాయపీఠంపై కూర్చున్న అత్యున్నత వ్యక్తి. కానీ తాను కూడా ఒక సామాన్యుడినే అనే విధంగా న్యాయానికి అతీతంగా వ్యవహరించారు. రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రాఘవేంద్ర సింగ్ రాథోడ్ తన 30 ఏళ్ల కూతురుని ఇంట్లో నిర్బంధించారు. సిద్ధార్థ ముఖర్జీ అనే వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లాడకుండా జస్టిస్ రాఘవేంద్ర ఇలా చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో జస్టిస్ రాఘవేంద్ర కూతురిని సోమవారం (డిసెంబర్ 16) తమ ముందు ప్రవేశపెట్టాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించడంతో ఎట్టకేలకు ఆమెకు విముక్తి లభించింది.