: మండలిలో తోసుకున్న టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
శాసనమండలి వద్ద టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీల మధ్య ఘర్షణ తలెత్తింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు జై తెలంగాణ నినాదాలు, టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్సీలు జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర ఎమ్మెల్సీలు బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా.. అక్కడకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది ఇరువురి మధ్య ఘర్షణకు దారి తీసింది. ఒకరినొకరు తోసుకోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కిందపడిపోయారు. నన్నపనేని, స్వామిగౌడ్ పోటాపోటీ నినాదాలు చేశారు. టీడీపీ సీమాంధ్ర ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి కోపంతో బిల్లు ప్రతులను చించివేశారు. పోలీసులు ప్రవేశించి వారిని సముదాయించారు.