: ఇరాక్ లో తన అధికారి సహా కుటుంబ సభ్యులను కాల్చిచంపిన గన్ మెన్


ఇరాక్ లో ఆరోగ్య మంత్రిత్వశాఖలో పనిచేస్తున్న అధికారిని, ఆయన కుటుంబసభ్యులను వారి గన్ మెన్ కాల్చి చంపాడు. వీరు సాధియాలోని తమ ఇంట్లో నిద్రిస్తుండగా గన్ మెన్ కాల్చి చంపినట్టు ఆ దేశ పోలీసులు తెలిపారు. మృతిచెందిన వారిలో అధికారి సహా ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. గన్ మెన్ వారిని కాల్చిచంపడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు అన్నారు.

  • Loading...

More Telugu News