: ఆమ్ ఆద్మీ రూట్లో వెళ్తాం: జేపీ


దేశంలో కొత్త రాజకీయానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాంది పలికిందని లోక్ సత్తా అధినేత జేపీ అన్నారు. ఇకపై తాము కూడా ఏఏపీ రూట్లో వెళతామని తెలిపారు. 2014 ఎన్నికల్లో కొత్త రాజకీయాలకు తెరలేపుతామని... మెరుగైన పాలనకోసం ప్రజలు లోక్ సత్తాతో కలసి పనిచేయాలని కోరారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు సమస్యలు, నీటి సమస్యలు, మద్యం తదితర సమస్యలపై ప్రజల్లోకి వెళతామని చెప్పారు. రాష్ట్రంలో ఏఏపీ ఏర్పడితే... దానితో కలిసి పనిచేసేందుకు తమకు అభ్యంతరం లేదని అన్నారు.

  • Loading...

More Telugu News