: ఇకపై ఓట్లు మావే.. సీట్లూ మావే: బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య


దొరల కంటే సమర్థులైన నాయకులు బీసీల్లో ఉన్నా... ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం తమకు రాలేదని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 28 మంది ప్రధాన మంత్రులయ్యారని... కానీ, ఒక్క బీసీ వ్యక్తి కూడా ఆ పదవిని చేపట్టలేకపోయారని అన్నారు. ఇకపై మాకు వాటా వద్దని... ఢిల్లీలో కోటా కావాలని చెప్పారు. 'రానున్న రోజుల్లో ఓట్లు మావే.. సీట్లూ మావే' అన్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో జరిగిన బీసీ గర్జనలో ఆయన ప్రసంగించారు. ఈ పార్టీలు, ప్రభుత్వాలు బీసీలను చిన్న చూపు చూస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు వచ్చే వరకు మా పోరాటం ఆగదని అన్నారు. బీసీలకు ఉప ప్రణాళిక పెట్టేందుకు ప్రధానికి, ముఖ్యమంత్రికి మనసు రావడం లేదని విమర్శించారు. దేశంలో 52 శాతం ఉన్న బీసీలకు కేవలం 7 శాతం ఉద్యోగాలు మాత్రమే కల్పించారని విమర్శించారు.

  • Loading...

More Telugu News