: మరో 20 రోజుల గడువు కావాలని రాష్ట్రపతిని అడుగుతాం: బొత్స
తెలంగాణ ముసాయిదా బిల్లులోని ప్రతి క్లాజ్ పై చర్చ జరగాలంటే... రాష్ట్రపతి ఇచ్చిన సమయం సరిపోదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అందువల్ల అదనంగా మరో 20 రోజుల సమయం ఇవ్వాలని రాష్ట్రపతిని కోరతామని తెలిపారు. చర్చపై కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయబోదని... ఎమ్మెల్యేలందరూ తమ వైఖరిని స్వేచ్ఛగా వెల్లడించవచ్చని చెప్పారు. బిల్లుపై చర్చ మాత్రమే ఉంటుందని, ఓటింగ్ ఉండదన్న దిగ్విజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... టీడీపీ అన్ని విషయాలను రాజకీయం చేస్తోందని విమర్శించారు. బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు ద్వంద్వ నీతికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.