: ఎన్నికల తేదీల ప్రకటన తర్వాతే పొత్తులపై నిర్ణయం: జవదేకర్
పార్టీలతో పొత్తులపై ఇప్పుడే చెప్పలేమని, ఎన్నికల తేదీల ప్రకటన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగాల్సిందేనన్నారు. దాంతో పాటు సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించాల్సిఉందని చెప్పారు. సొంత పార్టీకి చెందిన ఎంపీలే అవిశ్వాస తీర్మానం పెట్టడం ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడా జరగలేదన్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సొంత పార్టీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఫిబ్రవరిలో జరిగే తుది సమావేశాల్లోపు తెలంగాణ బిల్లు తీసుకువచ్చేది అనుమానమేనని ఆయన సందేహం వ్యక్తం చేశారు.