: సోనియాగాంధీకి అండగా ఉండాల్సిన బాధ్యత కేసీఆర్ కు ఉంది: సుఖేందర్ రెడ్డి
యూపీఏ ప్రభుత్వాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళుతున్న సోనియా గాంధీకి అండగా నిలవాల్సిన బాధ్యత టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు ఉందని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేవరకు పార్టీలతో సంబంధం లేకుండా కలసికట్టుగా పనిచేయాలని ఆయన టీఆర్ఎస్ కు విజ్ఞప్తి చేశారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుంటే జగన్ ఎక్కడుండే వారని ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతో లబ్ధి పొందిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఇప్పుడు తిరుగుబాటు చేయటం పార్టీకి ద్రోహం చేసినట్టేనని ఆయన దుయ్యబట్టారు.