: ఈ నెల 16న జైలు నుంచి విడుదలవనున్న లాలు


ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నెల 16న (సోమవారం) రాంచీలోని బిర్సా ముండా కారాగారం నుంచి విడుదలవనున్నట్లు తెలుస్తోంది. దాణా స్కాంలో అరెస్టై రాంచీ జైల్లో ఉన్న లాలూకు నిన్న(శుక్రవారం) సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకా కోర్టుకు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంది. దాంతో, సోమవారం ఓ అర్ధగంట పని ఉంటుందని, ఆ తర్వాత లాలూ విడుదలవుతారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. విడుదలైన వెంటనే లాలూ నేరుగా గుడికి వెళ్లి పూజలు నిర్వహించిన అనంతరం ఇంటికి వెళతారని ఆర్జేడీ నేత ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News