: స్వామీజీ చెప్పాడు.. బాబు బతుకుతాడు..
మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? అంటే అవుననే అంటున్నారు కొందరు భక్తులు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనం కోసం నారాయణ, అర్చన దంపతులు తమ ఏకైక కుమారుడు శ్రీదత్త(4) ను తీసుకుని వెళ్లారు. వారి కుటుంబం బృందావనాన్ని దర్శించుకుంటుండగా ఓ పాము బాలుడి ఎడమ చేతిపై కాటు వేసింది. దీంతో భక్తులు భయాందోళనలతో పరుగులు తీశారు.
ఈ గందరగోళంలో దేవాలయ సిబ్బంది బాలుడ్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఇంతలో ఓ స్వామీజీ వచ్చి బాలుడికి పూజలు చేస్తే బతుకుతాడని చెప్పాడు. అంతే అంత్యక్రియలను వాయిదా వేసిన కుటుంబసభ్యులు మృతదేహానికి పూజలు జరిపిస్తున్నారు.