: కేజ్రీవాల్ ను 'కామెడీ నైట్స్ విత్ కపిల్' కు ఆహ్వానిస్తా: కపిల్ శర్మ
ఢిల్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన 'కామెడీ నైట్స్ విత్ కపిల్' షోకు ఆహ్వానిస్తామని టీవీ కమెడియన్ కపిల్ శర్మ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహణ తనను ఎంతగానో ఆకట్టుకుందన్న కపిల్ శర్మ, ఆమ్ ఆద్మీ పార్టీ దేశ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తుందన్న ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రజలతో పాటు తాను కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కపిల్ శర్మ తెలిపారు.