: 2014 ఎన్నికలు దృఢమైన ప్రభుత్వాన్ని అందిస్తాయనుకోవడం లేదు: చిదంబరం
ఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు తీవ్రంగా పోటీ ఇవ్వడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని ఇప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం సాధారణ ఎన్నికలకు అన్వయించారు. ఢిల్లీలో జరిగిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులే తదుపరి లోక్ సభ ఎన్నికల తర్వాత దేశం మొత్తం ఎదుర్కోవచ్చని చెప్పారు. అంతేగాక 2014 సాధారణ ఎన్నికలు దృఢమైన ప్రభుత్వాన్ని అందిస్తాయనుకోవడం లేదని పేర్కొన్నారు.