: బిల్లు ప్రతులను నిన్నే ఇచ్చుంటే ఈ రెండ్రోజులు చదువుకునేవాళ్లం: టీటీడీపీ


ఏదో ఒక విధంగా తెలంగాణ బిల్లును ఆపాలని సీఎం కిరణ్ ప్రయత్నిస్తున్నారని టీటీడీపీ నేతలు ఆరోపించారు. బిల్లును రాష్ట్రపతి పంపారని... సీఎం ఎంత ప్రయత్నించినా విభజన ఆగదని తెలిపారు. కాకపోతే, సమయం మించిపోతే బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం కష్టమౌతుందని అన్నారు. అందువల్ల వీలైనంత త్వరలో బిల్లుపై చర్చ జరిపి ఢిల్లీకి పంపాలని సూచించారు. నిన్ననే బిల్లు ప్రతులను ఇచ్చి ఉంటే సెలవు దినాలైన శని, ఆది వారాల్లో వాటిని అందరూ చదువుకునే వారని అన్నారు. టీడీఎల్పీ కార్యాలయంలో మోత్కుపల్లి, ఎర్రబెల్లి తదితర తెలంగాణ తెదేపా నేతలు మీడియాతో మాట్లాడారు. బిల్లుపై చర్చ సమయంలో సభ్యులందరూ కూడా రెచ్చగొట్టే ధోరణిని కాకుండా సహకరించుకునే ధోరణిని పాటించాలని టీటీడీపీ నేతలు కోరారు. తెలంగాణకు మద్దతివ్వాలని అన్ని పార్టీలను కోరతామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News