: హృతిక్ విడాకులకు అర్జున్ రాంపాల్ కారణమా?


బాలీవుడ్ క్రేజీ సూపర్ హీరో హృతిక్ రోషన్ తన ప్రేమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. 17 ఏళ్ల ప్రేమ బంధానికి 13 ఏళ్ల వివాహబంధానికి ముగింపు పలికినట్టు హృతిక్ తెలిపాడు. అసలు వీరి వివాహ బంధం బీటలు వారడానికి కారణమేంటని బాలీవుడ్ మీడియా ఆరాలు తీసింది. వాటిల్లో తేలిందేంటంటే అత్తమామలతో ఉన్న విబేధాలకు తోడు, హృతిక్ సోదరి ఇంటికి వచ్చి చేరడంతో మరింత అగాధం ఏర్పడినట్టు తెలుస్తోంది.

మరో వైపు హృతిక్ భార్య సుజానేకి సూపర్ మోడల్, బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తో ఉన్న స్నేహం కూడా కారణమని అంటున్నారు. అర్జున్ రాంపాల్ కూడా మెహర్ జెసియాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. హృతిక్ రోషన్, అర్జున్ రాంపాల్ కుటుంబాల మధ్య ఏన్నో ఏళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనిపై స్పందించాలని మీడియా రాంపాల్ ను కోరగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News