: మూడు గిట్టల కొత్త గుర్రం ఉండేదట!


గుర్రాలకు సంబంధించిన జీవ పరిణామక్రమంలో కొన్ని ఖాళీలున్నాయి. వాటిని పూరించడానికి శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణలో వారికి ఒక కొత్తరకం గుర్రానికి సంబంధించిన శిలాజం లభ్యమయ్యింది. దీంతో గుర్రాల పరిణామక్రమంలోని ఖాళీ పూరించబడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఆఫ్రికా ప్రాంతంలోని మైదానాల్లో గడ్డిమేస్తూ జీవించిన ఒక కొత్తరకం గుర్రం ఉండేదని, దీని పాదాలకు మూడు గిట్టలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనలో ఇథియోపియాలో ఒక కొత్త జాతికి చెందిన గుర్రపు శిలాజం బయటపడింది. ఇది సుమారు 44 లక్షల సంవత్సరాలకు ముందు జీవించేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కొత్త శిలాజం గుర్రాలకు సంబంధించిన పరిణామక్రమంలోని ఖాళీని పూరిస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చిన్నపాటి జీబ్రా పరిమాణంలో ఉండే దీని పేరు యూరీగ్నాతోహిపస్‌ వోల్డెగబ్రియేలీ. ఇది ఆఫ్రికా ప్రాంతంలోని మైదానాల్లో నివసించేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News