: సీఎంకి 65వ లేఖ పంపిన దత్తన్న


ప్రజాసమస్యలపై లేఖాస్త్రాలు సంధించడంలో బీజేపీ మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తర్వాతే ఎవరైనా. పాలన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందంటూ సీఎంకు మరో లేఖ రాశారు. దీంతో దత్తన్న.. ముఖ్యమంత్రికి పంపిన లేఖల సంఖ్య 65కు చేరింది.

విద్యుత్ సమస్య, ఆధార్ కార్డుల జారీ, తాగునీటి ఎద్దడి, గ్యాస్ కొరత వంటి విషయాల్లో తగిన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సామాన్యుడిని ఆదుకోలేని ప్రభుత్వం థర్మల్ ప్రాజెక్టులు నిర్మించేందుకు తహతహలాడుతోందని విమర్శించారు. 

  • Loading...

More Telugu News