: దిగ్విజయ్ రాక దుశ్శకునం: అశోక్ బాబు


దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి రావడం దుశ్శకునమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి కోసమే దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చారని అన్నారు. రాష్ట్ర విభజనపై మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా శాసనసభ్యులు తీర్మానం చేస్తారని ఆయన స్పష్టం చేశారు.

బిల్లు పార్లమెంటులో చర్చకు రాదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాసనసభ ముట్టడి కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని అన్నారు. జనవరి 5న ఏపీఎన్జీవోల ఎన్నికలు జరుగనున్నాయని, వాటి వల్ల జరిగే నష్టం లేదని అన్నారు. ఎన్నికలు వేరు, ఉద్యమం వేరు అని ఆయన స్పష్టం చేశారు.

అసెంబ్లీలో బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని అశోక్ బాబు తెలిపారు. ఉద్యమం పక్కదారి పట్టిందని పలువురు రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారని, అలాంటి అనుమానాలు వద్దని... అందరం కలిసి ఉద్యమాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అశోక్ బాబు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News