: వాల్ మార్ట్ ఇండియా సీఈవోగా క్రిష్ అయ్యర్ నియామకం
యూఎస్లోని ప్రముఖ రిటైల్ మార్కెట్ సంస్థ వాల్ మార్ట్ ఇండియా విభాగానికి ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈవో)గా క్రిష్ అయ్యర్ ను నియమించినట్లు కంపెనీ ఇవాళ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2014 జనవరి 20వ తేదీన క్రిష్ అయ్యర్ సీఈవో బాధ్యతలు చేపడతారని తెలిపింది. ప్రస్తుతం వాల్ మార్ట్ సీఈవోగా రామ్నిక్ నర్సీ పనిచేస్తున్నారని.. ఆయన స్థానంలోకి వస్తోన్న క్రిష్ భారత్ లోని తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారని కంపెనీ ఆ ప్రకటనలో వెల్లడించింది.