: తండ్రి అయిన షట్లర్ చేతన్ ఆనంద్
ప్రఖ్యాత బాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ తండ్రి అయ్యాడు. ఈ నెల 8వ తేదీన తన భార్య శారద పండంటి పాపకు జన్మనిచ్చిందని ఆనందంతో తెలిపాడు. ఇంకో విషయం ఏంటంటే, పాప పుట్టిన రోజే (డిసెంబర్ 8) చేతన్ పుట్టిన రోజు కూడా. దీంతో, తన పుట్టిన రోజున భగవంతుడు ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చాడని ఆనంద్ పొంగిపోతున్నాడు. తాను అబ్బాయి పుట్టాలని కోరుకోలేదని, అమ్మయే పుట్టాలనుకున్నానని... దేవుడి దయతో అనుకున్నది జరిగిందని అన్నాడు. చేతన్ ఆనంద్ ప్రముఖ షట్లర్ గుత్తా జ్వాల మాజీ భర్త అన్న విషయం తెలిసిందే.