: గొడ్డు మాంసం ఎగుమతిలో పోటీ పడుతున్న భారత్


హిందువులు అత్యధికులుగా ఉన్న భారత్.. హిందువులు పవిత్రంగా భావించే గోమాత విషయంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోబోతోంది. త్వరలో గొడ్డు మాంసం ఎగుమతుల్లో ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుకోబోతోంది. నిజానికి గోవధ దేశంలో నిషేధం. కానీ అది అమలవుతున్న తీరు మాత్రం అంతంతే. దీంతో గొడ్డు మాంసం ఎగుమతి ఒక ప్రధాన వ్యాపారంగా ఎదుగుతోంది.

ప్రస్తుతం దేశంలో 21లక్షల టన్నుల గోమాంస వినియోగం ఉంది. ఈ ఏడాది దేశం నుంచి 18 లక్షల టన్నుల మాంసం ఎగుమతి అవుతుందని అంచనా. దీంతో ఎగుమతుల్లో బ్రెజిల్ తర్వాత రెండో స్థానానికి భారత్ చేరుతుంది. ఈ వివరాలను అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించింది. 2010-11లో గొడ్డు మాంసం ఎగుమతుల విలువ 190కోట్ల డాలర్లు ఉండగా.. అది 2012-13 నాటికి 320కోట్ల డాలర్లకు పెరిగిపోయింది. ఈ పరుగు చూస్తుంటే గొడ్డుమాంసం ఎగుమతుల్లో భారత్ మొదటి స్థానాన్ని చేరుకోవడానికి ఎక్కువ కాలం పట్టే అవకాశం లేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News