: సమైక్యం కోసం పంజాబ్ సీఎంను కలిసిన జగన్
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఉదయం పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ ను జగన్ కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా, పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించాలని కోరారు. అంతేకాక రాష్ట్ర పరిస్థితిని కూడా ఆయన బాదల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆర్టికల్ 3 సవరణకు కలసి రావాలని, మళ్లీ ఇటువంటి విభజనలు పునరావృతం కాకుండా చూడాలని కోరినట్టు తెలుస్తోంది.