: స్మార్ట్‌ఫోన్‌కు కూడా పెన్‌డ్రైవ్
ఇప్పటి వరకూ కంప్యూటర్లకు, ల్యాప్‌టాప్‌లకు మాత్రమే ఉండే పెన్‌డ్రైవ్‌లు ఇప్పుడు మీ స్మార్ట్ఫోన్లకు కూడా రానున్నాయి. ఇప్పటి వరకూ బయటికి వెళ్లిన సమయంలో చేతిలో పెన్‌డ్రైవ్ ఉంటే చాలు ఇక కంప్యూటర్‌కు సంబంధించి ఎలాంటి పనైనా మనం చేసేయవచ్చు అనుకుంటాం. అలాకాకుండా మన స్మార్ట్ఫోన్లకు కూడా పెన్‌డ్రైవ్ ఉంటే... ఇక అరచేతిలోనే ప్రపంచం ఉంది అన్నంత ఆనందంగా ఉంటుంది. ఇలా ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసేలా స్మార్ట్ఫోన్లకు కనెక్టయ్యేలాంటి కొత్తరకం పెన్‌డ్రైవ్‌లు త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి.
ఇప్పటి వరకూ కంప్యూటర్లు, డివిడి ప్లేయర్లు వంటి వాటికి మాత్రమే ఉపయోగిస్తున్న పెన్‌డ్రైవ్‌లు త్వరలోనే మీ స్మార్ట్ఫోన్లకు, ట్యాబ్లెట్లకు కూడా పెట్టేయవచ్చు. ఇలాంటి సరికొత్త పెన్‌డ్రైవ్‌లను ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ కంపెనీ తయారుచేసింది. ఈ కొత్తరకం పెన్‌డ్రైవ్‌లను ఐస్‌క్రీమ్ శాండ్విచ్ నుండి జెల్లీబీన్ వరకూ అన్ని వెర్షన్ల ఆండ్రాయిడ్ ఫోన్లలో వినియోగించవచ్చు. ఆండ్రాయిడ్ 4.4 (కిట్‌క్యాట్) వెర్షన్‌కు కూడా దీన్ని ఉపయోగించేలా చాలా ఆకర్షణీయంగా ఆధునికీకరిస్తున్నట్టు సోనీ కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం 8,16,32 జీబీల సామర్ధ్యంతో ఈ పెన్‌డ్రైవ్‌లను రూపొందించారు. 8జీబీ పెన్‌డ్రైవ్ ధర సుమారు 1260 రూపాయలు, 16 జీబీ ధర రూ.1890, 32 జీబీ ధర సుమారుగా నాలుగు వేలుగా ఉంటుంది. వీటిని వచ్చే ఏడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు.