: కేమెరాకు చిక్కిన అవినీతి ఎంపీలు.. సిఫార్సుకు 50 వేల నుంచి 50 లక్షలు డిమాండ్


'కోబ్రా పోస్ట్' స్టింగ్ ఆపరేషన్ లో 11 మంది ఎంపీలు అడ్డంగా బుక్కయ్యారు. ఆయిల్ వెలికితీత లైసెన్స్ కోసం సిఫార్సుకు 50 వేల నుంచి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ రహస్య కేమెరా కంటికి చిక్కారు. ఆపరేషన్ ఫాల్కన్ క్లా పేరిట ఏడాది పాటు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో పదకొండు మంది అవినీతి ఎంపీలు దొరికారు.

వీరిలో ఇద్దరు కాంగ్రెస్ (ఖిలాడి లాల్ బైర్వా, విక్రమ్ భాయ్ అర్జున్ భాయ్), ముగ్గురు బీజేపీ(లాలూ భాయ్ పటేల్, రవీంద్ర కుమార్ పాండే, హరి మంజి), ఇద్దరు అన్నాడీఎంకే( కె సుగుమార్, సి రాజేంద్రన్), ముగ్గురు జేడీయూ(విశ్వమోహన్ కుమార్, మహేశ్వర్ హజారీ, బుడియో చౌదరి), ఒకరు బీఎస్పీ(కైసర్ జహాన్) ఎంపీ ఉన్నారు.

  • Loading...

More Telugu News