: కాంగ్రెస్ అగ్రనాయకులకు గురిపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీని పదిహేనేళ్లు ఏలిన ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ... ఇప్పుడు కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి తమ అస్త్రాలను గురి పెట్టింది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ సభ్యుడు మనీష్ సిసోడియా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలపై పోటీకి తమ అభ్యర్థులను బరిలోకి దించనున్నామని తెలిపారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీపై తమ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న 'ఏఏపీ హృదయసామ్రాట్' కవి కుమార్ విశ్వాస్ ను పోటీలోకి దించనున్నట్టు చెప్పారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ బరిలోకి దిగనున్నట్టు ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.