: బొప్పాయి గింజలతో మధుమేహం, క్యాన్సర్, హార్ట్ ఎటాక్ దూరం!
నేటి స్పీడ్ యుగంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడానికి కూడా సమయం చాలడంలేదని కొందరు చెబుతుంటారు. నిజమే, వృత్తిలో చికాకులు, ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు అనారోగ్యానికి కారణమవుతుంటాయి. శరీరంలో వచ్చిన మార్పులు గమనించే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మధుమేహం, హార్ట్ ఎటాక్, క్యాన్సర్ లాంటి ప్రమాదకర జబ్బులు ఇలానే కబళిస్తుంటాయి.
అయితే, బొప్పాయి పండుతో వీటన్నిటికి చెక్ పెట్టవచ్చని కరాచీ యూనివర్శిటీ విద్యార్థులు అంటున్నారు. బయట విరివిగా దొరికే బొప్పాయిలో ఈ వ్యాధి కారకాలను నియంత్రించే గుణం మెండుగా ఉందని వారు తమ పరిశోధనల్లో తేల్చారు. అయితే, బొప్పాయి ఫలం కంటే వాటి విత్తనాలే మిక్కిలి ఔషధ విలువలు కలిగి ఉన్నాయట.
రోజూ ఓ స్పూన్ బొప్పాయి విత్తనాలు తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులే కాకుండా కిడ్నీ, కాలేయం, ఉదర సంబంధ వ్యాధులు కూడా దరిచేరవని హామీ ఇస్తున్నారు. మరి మనమూ స్వీకరిద్దామా బొప్పాయి విత్తనాలు.. జస్ట్.. ఓ టీ స్పూనే కదా..!