: ముగ్దూం భవన్ లో నారాయణతో కోదండరాం భేటీ
తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు కోదండరాం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని ముగ్దూం భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా కోదండరాం ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని నారాయణను కోరారు. దీనివల్ల ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టవచ్చని అన్నారు. దీనికి ఎలాంటి నియమనిబంధనలు అడ్డురావని అన్నారు. కాగా బిల్లుపై శాసనసభ అభిప్రాయం తెలిపేందుకు రాష్ట్రపతి ఆరు వారాల సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే.