: రాజకీయాల్లోంచి నేను తప్పుకోను: ధర్మాన
తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు రాజకీయాల్లోంచి తప్పుకోనని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తనను ముద్దాయిని చేసిందన్నారు. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ ముద్దాయిలకు పార్టీ టికెట్లు ఇవ్వనంటున్నారని... తనకు ముద్దాయిగా రాజకీయాలనుంచి తప్పుకునే ఆలోచన లేదని తెలిపారు. టీడీపీలోకి తాను వెళ్లలేనని, ఇక మిగిలింది వైఎస్సార్సీపీయేనని చెబుతూ, తానే పార్టీలోకి వెళ్లనున్నది స్పష్టం చేశారు.