: ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నిక ఏకగ్రీవం
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు వేసిన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధుల ఎన్నిక ఏకగ్రీవమైంది. ఆరో అభ్యర్ధిని నిలబెట్టాలనుకున్న కాంగ్రెస్ చివరి వరకు అధిష్ఠానం
అనుమతి కోసం వేచి చూసింది. అక్కడి నుంచి అనుమతి రాకపోవడం, ఇటు నామినేషన్
గడువు ముగియడం జరిగింది. దీంతో ఐదుగురే బరిలో ఉండడంతో, ఎంపిక ఏకగ్రీవంగా జరిగినట్లు అసెంబ్లీ కార్యాలయ కార్యదర్శి తెలిపారు.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా పొంగులేటి సుధాకర్, షబ్బీర్ అలీ, కోలగట్ల, సంతోష్, లక్షీశివకుమారి.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా యనమల, సలీమ్, శమంతకమణి ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. అటు టీఆర్ఎస్ నుంచి మహ్మద్ అలీ, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆదిరెడ్డి అప్పారావు ఎన్నిక కూడా ఏకగ్రీవంగానే జరిగింది.