: దిగ్విజయ్ సింగ్ ను కలవను: శైలజానాథ్
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో హైదరాబాదుకు వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ను కలవనని మంత్రి శైలజానాథ్ తెలిపారు. విభజన విషయంలో ఆయనకు కొత్తగా చెప్పేదేమి లేదన్నారు. అంతేగాక ఈ సాయంత్రం రాయలసీమ ప్రజాప్రతినిధుల సమావేశానికి కూడా వెళ్లనన్నారు.