: ఛత్తీస్ గఢ్ సీఎంగా రమణ్ సింగ్ ప్రమాణ స్వీకారం
ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ శేఖర్ దత్ రమణ్ సింగ్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ అగ్రనేతలు పాల్గొన్నారు. సీఎంగా రమణ్ సింగ్ బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి.