: పార్లమెంటు ఉభయసభలు గంట వాయిదా


పార్లమెంటు ఉభయసభలు ఈ రోజు ప్రారంభంకాగానే వాయిదా పడ్డాయి. లోక్ సభ ప్రారంభం కాగానే, సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులతో స్పీకర్ వెల్ లోకి వెళ్లి, సమైక్య నినాదాలు చేశారు. వీరితో పాటు బీజేపీ సభ్యులు కూడా యూపీఏకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో, లోక్ సభను స్పీకర్ మీరా కుమార్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా బీజేపీ సభ్యులు గందరగోళం సృష్టించడంతో, సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News