: రాష్ట్రపతి నుంచి బిల్లు రాగానే అసెంబ్లీకి పంపుతాం: షిండే


తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి వచ్చిందా? లేదా? అనే విషయంలో నెలకొన్న తీవ్ర సందిగ్ధతకు హోం మంత్రి షిండే తెరదించారు. టీబిల్లు ఇంకా రాష్ట్రపతి వద్దే ఉందని షిండే స్పష్టం చేశారు. రాష్ట్రపతి నుంచి తెలంగాణ బిల్లు రాగానే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపుతామని తెలిపారు. అనంతరం, బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ నుంచి బిల్లు తిరిగి రాగానే కేంద్ర కేబినెట్ లో చర్చిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News