: వారం రోజులు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు
సభా వ్యవహారాల సలహాసంఘం(బీఏసీ) సమావేశం ముగిసింది. ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని బీఏసీ నిర్ణయించింది. తొలిరోజు దక్షాణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలాకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది. సభలో వరుస తుపానులు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై చర్చించాలని నిర్ణయం తీసుకుంది. శాసనసభలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్సీపీ కోరింది. అయితే, రాష్ట్ర విభజనకు సంబంధించి ముసాయిదా బిల్లు సభకు వచ్చే అవకాశం ఉన్నందున తీర్మానం అవసరం లేదని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముసాయిదా బిల్లు వచ్చాక మరోసారి బీఏసీ భేటీ అవుతుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు, వైసీపీనేత శోభానాగిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.