: 'గే'లి చేయద్దంటున్న సిద్దార్థ, శృతి హాసన్!
స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధమంటూ ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కొందరు సినిమా తారలు పెదవి విరుస్తున్నారు. "అలాంటి లక్షణాలతో పుట్టినవారు అలా ప్రవర్తించడం సహజమే. దాన్ని చట్ట విరుద్ధం అంటే ఎలా. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ తీర్పు బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్, లెస్బియన్లకు అన్యాయం చేసేదే"అంటూ హీరో సిద్ధార్థ ట్వీట్ చేశాడు. అలాగే, ఈ తీర్పు స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా ఉందంటూ... వారికి అనుకూలంగా శృతి హాసన్ కామెంట్ చేసింది.