: పిట్ట కొంచెం కూత ఘనం.. రికార్డు పుటలకెక్కిన చిన్నారి
పిట్ట కొంచెం కూత ఘనం అనే నానుడి ఈ చిన్నారికి అతికినట్టు సరిపోతుంది. ఆరేళ్లకే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించి సహ విద్యార్థులకు స్ఫూర్తినిస్తోంది. హైదరాబాద్ లోని ఖైరాతాబాద్ నాసర్ స్కూల్ లో ఒకటో తరగతి చదువుతున్న శిక్షాసాగర్ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయుల సాక్షిగా స్కేటింగ్ చేస్తూ కీబోర్డు ప్లే చేసి రికార్డు పుటల్లో తన పేరు లిఖింపజేసుకుంది.
స్కేటింగ్ చేస్తూ కీబోర్డు ప్లే చేయడం కష్టసాధ్యమైన పనైనా... దాన్ని పది నిమిషాలు పాటు నిరాఘాటంగా చేసి శభాష్ అనిపించుకుంది. అంతేకాకుండా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధించింది. చిన్న వయసులోనే ఘనత సాధించిన శిక్షాసాగర్ కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సర్టిఫికేట్ అందజేశారు.