: రాష్ట్రపతితో ముగిసిన సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సీమాంధ్ర, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీ ముగిసింది. దాదాపు గంటపాటు కొనసాగిన భేటీలో ముందుగా రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విభజన బిల్లును అసెంబ్లీకి పంపాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కోరితే, రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్న విభజనను ఆపాలని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు కోరినట్లు సమాచారం.