: కనిపించకుండా పోయిన కార్తీక్... కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు
రాజేంద్రనగర్ వాసి కార్తీక్ ఇవాళ ఉదయం శవమై తేలడంతో కన్నవారు కన్నీరుమున్నీరయ్యారు. హైదరాబాద్ జలమండలిలో లైన్ మెన్ గా విధులు నిర్వర్తిస్తున్న కార్తీక్ నిన్న (మంగళవారం) ఉదయం నుంచి కనిపించ లేదు. ఇవాళ ఉదయం జీహెచ్ఎంసీ స్వీపర్లకు యువకుని మృతదేహం కనిపించింది. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు కుటుంబ సభ్యులను రప్పించగా వారు కార్తీక్ మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని శవ పంచనామా కోసం ఆస్పత్రికి తరలించారు.