: నన్ను ఎవరు అడ్డుకోగలరు?: జేసీ
తనను సీఎల్పీ కార్యాలయానికి రాకుండా అడ్డుకునే సత్తా ఎవరికి ఉందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. సోనియాపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతుండడంపై ఆయన స్పందిస్తూ, కేవలం కాంగ్రెస్ పార్టీలోని సైకో ఫాంట్స్ మాత్రమే తనను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తాను ప్రజలు ఎన్నుకుంటే అసెంబ్లీలో అడుగుపెట్టానని ఆయన స్పష్టం చేశారు.