: పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేస్తుంటే చేతులు కట్టుకున్నారేం?: కిషన్ రెడ్డి


కాంగ్రెస్ పార్టీ, టీడీపీకి చెందిన ఎంపీలు మూకుమ్మడిగా తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుంటే ఆ రెండు పార్టీలకు చెందిన అధిష్ఠానాలు ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ తెలంగాణకు మద్దతిస్తోందని అందుకే విభజన జరుగుతోందని అన్నారు. విధానపరమైన నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి ఉన్న ఏకైక పార్టీ బీజేపీనే అని తెలిపారు. సీమాంధ్రలో జరుగుతున్నది ఆధిపత్యం కోసం పోరాటమే కాని సమైక్య ఉద్యమం కాదని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News