: కుర్ర బోయ్ ఫ్రెండ్ తో మడోన్నా తెగతెంపులు!
55ఏళ్ల పాప్ స్టార్ మడోన్నా తన 25 ఏళ్ల బోయ్ ఫ్రెండ్ బ్రాహిం జైబాత్ కు కటీఫ్ చెప్పినట్లు సమాచారం. దీంతో మూడేళ్ల డేటింగ్ కాస్తా ముగిసిపోయింది. పని ఒత్తిడుల వల్ల బ్రాహిం, మడోన్నా మధ్య అంతరం పెరిగిపోయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే, మడోన్నా తన మాజీ భర్త సీన్ పెన్ తో కలిసి ఇటీవలే హైతి పర్యటన ముగించుకుని న్యూయార్క్ కు తిరిగి వచ్చింది. దీంతో 1989లో విడాకులు తీసుకున్న వీరిద్దరూ మళ్లీ ఒక్కటి కానున్నారనే వార్తలు వెలువడుతున్నాయి.