: తెలంగాణ గేయ రచయిత రావెళ్ల కాలధర్మం.. పలువురు టీఆర్ఎస్ నేతల సంతాపం


తెలంగాణకు తేటతెలుగు గేయాలను అందించిన కలం ఆగిపోయింది. రజాకార్లకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున లేచిన ఉద్యమ కెరటం పడిపోయింది. తెలంగాణ గేయ రచయిత రావెళ్ల వెంకట రామారావు స్వగ్రామమైన ఖమ్మం జిల్లా గోకినేపల్లిలో కాలధర్మం చెందారు. ఈయన వయస్సు 86 సంవత్సరాలు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు ఉన్నారు. ఆయన మృతికి కేసీఆర్ తో పాటు పలువురు టీఆర్ఎస్ నేతలు సంతాపం ప్రకటించారు.

సంపన్న రైతు కుటుంబంలో పుట్టిన రావెళ్ల చిన్న నాటి నుంచే అభ్యుదయ భావాలతో ఉద్యమ బాట పట్టారు. రజాకార్లకు వ్యతిరేకంగా తుపాకి పట్టి సాయుధ పోరాటం చేస్తూనే.. తన కలం నుంచి పదునైన పదాలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారు. ‘కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకు బలం.. రజాకార్లను తరిమేస్తేనే తెలంగాణకు వరం’ అంటూ తొలి కవితను రాశారు.

రావెళ్ల రజాకార్ల ఉద్యమంలో జైలు జీవితం అనుభవించారు. జైలులోనే ఆయన పద్య, వచన కవిత్వంలో అనేక అవార్డులు, బిరుదులు పొందారు. ఆయన దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ తదితర ప్రముఖుల సమకాలీనుడు. పల్లెభారతి, జీవనరాగం, రాగజ్యోతులు వంటి కవితా సంకలనాలు రూపొందించారు. తెలుగు, ఉర్దూలో అద్భుత కవితలు రాస్తూనే ఆయన అద్భుతంగా మాట్లాడేవారు.

  • Loading...

More Telugu News