: సీమాంధ్ర ఎంపీలు అబద్దాలు ఆడుతున్నారు: మందా జగన్నాథం
స్వార్థపూరిత ఎంపీలు పిలుపునిచ్చిన అవిశ్వానికి బీజేపీ మద్దతు ప్రకటిస్తుందని సీమాంధ్ర ఎంపీలు చెప్పడం అబద్దమని తెలంగాణ ఎంపీ మందా జగన్నాథం అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, అవిశ్వాసానికి మద్దతిస్తే బీజేపీ వారు తెలంగాణ ప్రాంతంలో చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా సీమాంధ్రులు నడుచుకోవడం లేదని అన్నారు.