: హైదరాబాదులో అంతర్జాతీయ క్యాన్సర్ సదస్సు
ముందు తరాల వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యాన్సర్ చికిత్స అందించే లక్ష్యంతో హైదరాబాద్ ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు క్యాన్సర్ పై 'గ్లోబల్ ఆంకాలజీ' పేరుతో అంతర్జాతీయ సదస్సు నిర్వహించబోతున్నట్లు ఆసుపత్రి ఛైర్మన్, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తెలిపారు.
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఈ సదస్సును ప్రారంభించనున్నారని వెల్లడించారు. దాదాపు 2వేల మంది ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ నిపుణులు పాల్గొనే ఈ సదస్సులో.. రెండవ రోజు గైనకాలజీ, ఊపిరితిత్తులు, గొంతు క్యాన్సర్ లపై ప్రధానంగా చర్చించనున్నారని పేర్కొన్నారు