: సికింద్రాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ లో రైల్వే జీఎం తనిఖీలు


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇవాళ ఉదయం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ ఫారాలు, స్టేషన్ పరిసరాల శుభ్రత, ప్రయాణీకుల సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అనంతరం సికింద్రాబాద్-లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలులో ప్రయాణికుల సమస్యలను శ్రీవాత్సవ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. జీఎంతో పాటు రైల్వే అధికారులు లోకల్ రైలులో భద్రతా ఏర్పాట్లపై తనిఖీలు చేశారు.

  • Loading...

More Telugu News