: సస్పెన్షన్లకు మేం భయపడం: ఎంపీ హర్షకుమార్


ఎట్టి పరిస్థితుల్లోను తాము తగ్గేది లేదని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. తమను సస్పెండ్ చేసినా లెక్కచేయమని అన్నారు. పార్లమెంటు ఉభయసభలు వాయిదా పడిన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవిశ్వాసంపై చర్చ జరుగుతుందన్న నమ్మకం తమకుందని... తాము పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి తీరుతుందని చెప్పారు. గతంలో క్రమశిక్షణను ఉల్లఘించిన వారే... నేడు తమ క్రమశిక్షణను ప్రశ్నించడమేంటని అన్నారు. టీఆర్ఎస్ లోకి వెళ్లిన మందా జగన్నాథ్, వివేక్ లపై ఏం చర్య తీసుకున్నారని హర్షకుమార్ ప్రశ్నించారు. గతంలో సోనియాను కేసీఆర్ తిట్టినప్పుడు కూడా వీరిద్దరూ ఏం మాట్లాడలేదని అన్నారు.

అన్యాయంగా, ఏక పక్షంగా రాష్ట్ర విభజనకు పూనుకున్నారని... సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని భరించలేకే సొంత పార్టీపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యామని తెలిపారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెబుతామని అన్నారు. సీఎం కిరణ్ కొత్త పార్టీపై మీడియా ప్రశ్నించగా.. "కిరణ్ ఇంకా పార్టీ పెట్టలేదు... ఊహాజనితమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వనని" హర్షకుమార్ అన్నారు.

  • Loading...

More Telugu News