: స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం: సుప్రీం కీలక తీర్పు
స్వలింగ సంపర్కరం చట్ట విరుద్ధమని, ఇది చెల్లుబాటు కాదని సుప్రీం కోర్టు ఈ రోజు కీలక తీర్పు చెప్పింది. గేలు, లెస్బియన్ల మధ్య ప్రైవేటు లైంగిక సంబంధాలు నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పలు సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు స్వలింగ సంపర్కాన్ని చట్టం అంగీకరించదని స్పష్టమైన తీర్పు వెలువరించింది. సెక్షన్ 377 కింద స్వలింగ సంపర్కానికి పాల్పడితే జీవితకాల శిక్ష విధించడానికి చట్టం అనుమతిస్తోంది. అయితే, ఈ చట్టంలో ఎలాంటి లోపాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కం లాంటి అంశాలను కోర్టులు నిర్ణయించజాలవని.. పార్లమెంటే వీటిని నిర్ణయించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.