: జేబులో ఇమిడిపోయే రౌటర్‌


మనకు ఇంటర్నెట్‌ కావాలంటే ఒక బాక్స్‌లాంటి హబ్‌ను ఏర్పాటు చేసుకోవాలి, కేబుల్‌ వైర్లు కనెక్ట్‌ చేయాలి... ఇదంతా పెద్ద తతంగం. అలాకాకుండా చక్కగా జేబులో ఇమిడిపోయేలా వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే ఎంత బాగుంటుందో కదా... సరిగ్గా అలాగే చక్కగా జేబులో ఇమిడిపోయేంత చిన్నగా ఉండే ఒక వైర్‌లెస్‌ రౌటర్‌ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది. ఎంఎంఎక్స్‌ 440 డబ్ల్యూ పేరుతో ఉండే ఈ వైర్‌లెస్‌ వైఫై రౌటర్‌ స్లీక్‌ అండ్‌ స్టైలిష్‌గా ఉంటుంది. దీన్ని ఎక్కడికైనా మనతోబాటు చక్కగా జేబులో పెట్టుకుని తీసుకెళ్లవచ్చు. మనకు అవసరమైనప్పుడు దగ్గరలోని ల్యాన్‌ కేబుల్‌కు కనెక్ట్‌ చేస్తే చాలు, పదిమీటర్ల దూరంలో ఉన్న 32 కంప్యూటర్లకు, ల్యాప్‌టాప్‌లకు ఇంటర్నెట్‌ను అందిస్తుందట.

4400 ఎంఎహెచ్‌ బ్యాటరీతో కూడిన ఈ రౌటర్‌ డివైజ్‌ బ్యాటరీ లైఫ్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. ప్రయాణాల్లో కూడా ఈ రౌటర్‌ సాయంతో వైఫైతో మన ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లలో నెట్‌ కనెక్ట్‌ చేసుకోవచ్చు. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీతోబాటు సెక్యూర్డ్‌ వైఫై డివైజ్‌ బ్రౌజింగ్‌కు ఇది చాలా అనువుగా ఉంటుందట.

  • Loading...

More Telugu News