: నలుగురు ఆసీస్ క్రికెటర్లపై వేటు


క్రమశిక్షణకు ఆస్ట్రేలియా జట్టు ఎంత విలువిస్తుందో తాజా సంఘటనతో రుజువైంది. జట్టు నిబంధనలు ఉల్లంఘించారంటూ నలుగురు క్రికెటర్లపై నిర్దాక్షిణ్యంగా వేటు వేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వైస్ కెప్టెన్ షేన్ వాట్సన్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ ఉస్మాన్ ఖవాజా, పేసర్లు మిచెల్ జాన్సన్, జేమ్స్ ప్యాటిన్సన్ బోర్డు ఆగ్రహానికి గురయ్యారు.

దీంతో ఈ నలుగురు క్రికెటర్లు మొహాలీలో ఈనెల 14 న ప్రారంభమయ్యే మూడో టెస్టుకు దూరమవుతారు. కాగా, చివరి టెస్టుకు వీరిని జట్టు ఎంపికలో పరిగణిస్తామని కోచ్ మికీ ఆర్థర్ వెల్లడించారు. భారత్ చేతిలో వరుసగా రెండు టెస్టుల్లో చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. ఆ జట్టు యాజమాన్యం మిగతా రెండు టెస్టుల్లో గెలుపు అవకాశాలపై ఆసీస్ క్రికెటర్లను విశ్లేషణాత్మక నివేదిక సమర్పించాలని కోరింది. 

అయితే, మేనేజ్ మెంట్ ఆదేశాన్ని ఆ నలుగురు క్రికెటర్లు బేఖాతరు చేశారని ఆసీస్ కోచ్ మికీ ఆర్థర్ తెలిపారు. వేటు నిర్ణయం ఇబ్బందికరమే అయినా, ఆస్ట్రేలియా జట్టును అగ్రస్థానానికి చేర్చే క్రమంలో ఇలాంటి కఠిన చర్య తప్పలేదని ఆర్థర్ చెప్పారు. 

  • Loading...

More Telugu News