: ప్రాణాలతో చెలగాటం... సాహసంలో ప్రమాదం
కొందరు సాహసాలు చేస్తుంటారు. కొన్ని సాహసాలు చేయడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడడమే. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోవడం మాత్రం ఖాయం. ఇలా ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రమాదానికి గురై చివరికి ప్రాణాలు పోయినంతపనైంది. అయినా ఆ సాహసికుడు బతికిపోయాడు.
మనం నడుస్తున్నప్పుడు ఏదైనా రాయి తగిలి కింద పడినా... లేదా బాత్రూంలో కాలు జారిపడినా కూడా మనకు బలమైన దెబ్బలే తగులుతాయి. అంతెందుకు... మన ఇంటి పిట్టగోడపైనుండి పడినా కూడా బాగానే దెబ్బలు తగులుతాయికదా... అలాంటిది ఆకాశంలో సుమారు తొమ్మిదివేల అడుగుల ఎత్తునుండి కింద పడితే మనిషి అనేవాడి ప్రాణాలు ఉంటాయా...? కానీ అంత ఎత్తునుండి కింద పడినా కూడా ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు సదరు సాహసికుడు.
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 27 ఏళ్ల స్కైడైవర్ విక్టర్ బ్రైయి మరోవ్యక్తి ఫిలిప్స్‌తోబాటు స్కైడైవింగ్ చేస్తున్న సమయంలో ఇద్దరి పారాచూట్లు చిక్కుపడిపోయాయి. దీంతో తొమ్మిదివేల అడుగుల ఎత్తునుండి విక్టర్ కిందికి పడిపోయాడు. మాములుగా అయితే ప్రాణాలు పోయేవే. కానీ విక్టర్ విరిగిన ఎముకలు, తలకు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మొత్తానికి యముడి వద్దకు వెళ్లి ఒక హాయ్ చెప్పి మళ్లీ కిందికి వచ్చేశాడు విక్టర్.